‘ఓ స్ర్తి రేపురా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశీష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలీ రాధోడ్ ప్రధాన తారాగణంగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’. ఆడియో విడుదలలో తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీ్ధర్ పాల్గొని సీడీలు విడుదలచేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రస్తుతం హారర్ ట్రెండ్ సాగుతున్న దృష్ట్యా అదే తరహాలో చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రం ట్రైలర్లు, పాటలు బాగున్నాయని, ఇటీవల విడుదలవుతున్న హారర్ చిత్రాల స్థాయిలో లాభాలు తేవాలని మధుర శ్రీ్ధర్ అన్నారు. గతంలో కొన్ని గ్రామాలలో ఊళ్లో దెయ్యం తిరుగుతుందన్న భయంతో ఇంటి తలుపులపై ఓ స్ర్తి రేపురా అని వ్రాసేవారని, కొన్ని ఊళ్ళైతే మొత్తం ఖాళీ అయ్యాయని, ఆ నేపథ్యంలోనే కథ రాసుకుని సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి తెలిపారు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తయ్యాయని, డిసెంబర్ రెండు లేదా మూడోవారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు జీవీ, రాజ్ కందుకూరి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.