ధనుష్ నవ మన్మథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు ధనుష్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘తంగమగన్’. సమంత, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వేల్‌రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ‘నవ మన్మథుడు’ పేరుతో త్వరలో విడుదల కానుంది. డి.ప్రతాప్‌రాజ్ సమర్పణలో బృందావన్ పిక్చర్స్ పతాకంపై విడుదలవుతున్న ఈ చిత్రానికి ఎన్.వెంకటేష్, ఎస్.రవికాంత్ నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తిచేసుకుని ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, విలక్షణమైన నటునితో హీరోయిజాన్ని ప్రదర్శించే హీరో ధనుష్, తమిళంలోనే కాకుండా తెలుగులోకూడా ‘రఘువరన్ బి.టెక్’ సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వేల్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఈనెల 18న విడుదలవుతుంది. అనిరుధ్ అందించిన సంగీతం చిత్రానికి హైలెట్ కానుంది. సమంత, అమీ జాక్సన్‌ల గ్లామర్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ చిత్రానికి సంగీతం:అనిరుధ్, కెమెరా:ఎ.కుమరన్, ఎడిటింగ్:ఎం.వి.రాజేష్‌కుమార్, సహ నిర్మాతలు:ఆంజనేయరెడ్డి, కె.ఎస్.రెడ్డి, దర్శకత్వం:వేల్‌రాజ్.