ఆర్టీ ప్రాజెక్టులో ఖని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ తాజా చిత్రం డిస్కోరాజా థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతుంటే, గోపీచంద్ మలినేనితో చేయబోయే తరువాతి ప్రాజెక్టు పనులు వేగంగా సాగిపోతున్నాయి. సినిమాను భారీగా తెరకెక్కించే ఆలోచన ఉండటంతో, వివిధ భాషల్లోని స్టార్ ఆర్టిస్టులను ప్రాజెక్టులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కథలో ఓ కీలక పాత్ర కోసం తమిళ వర్సటైల్ ఆర్టిస్ట్ సముద్రఖినిని ఎంపిక చేసుకున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఖని పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయం మాత్రం రివీల్ కాలేదు. గతంలో రవితేజ -గోపీచంద్ కాంబోలో వచ్చిన డాన్‌శీను, బలుపు చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో -మూడో ప్రాజెక్టుపైనా భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజతో శృతిహాసన్ జోడీ కడుతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. హిట్టయిన తమిళ సినిమా సారంతో తెరకెక్కుతోన్న చిత్రంగా ముందు కథనాలు వినిపించినా అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కే అవకాశం ఉందన్నది తాజా టాక్.