మూడు మొవ్వ చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో కథనం చిత్రాన్ని రూపొందించిన మొవ్వ విజయచౌదరి తాజాగా ఎమ్ స్క్రీన్స్ పతాకాన్ని నెలకొల్పి వరుసగా మూడు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి, ప్రేక్షకులను వైవిధ్యమైన కథ, కథనాలున్న చిత్రాలను అందించి ఆనందింపజేయడానికి తాను ఈ కొత్త సంస్థను నెలకొల్పానని అన్నారు. అందులో భాగంగానే తమ సంస్థలో తొలి చిత్రంగా నాటకం ఫేమ్ ఆశీష్ గాంధీ కథానాయకుడిగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నామని అన్నారు. అలాగే నందినిరెడ్డి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సమర్పణ్‌రెడ్డి నేతృత్వంలో మరో చిత్రాన్ని, ఆర్.సురేష్ దర్శకత్వంలో మూడో చిత్రాన్ని రూపొందించడానికి అన్ని కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వివరాలు తమ సంస్థ ద్వారా ప్రకటిస్తామని ఆమె వివరించారు.