పూజ లేకుండానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహూ ప్రమోషన్స్, తరువాత వెకేషన్, ఆ తరువాత బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కోసం లండన్ టూర్.. ఇలా ప్రభాస్ బిజీ కావడంతో -జాన్ షూటింగ్ చాలాకాలంగా అడుగు ముందుకు పడటం లేదు. ఐదారు నెలలుగా షూటింగ్ అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. పనులన్నీ పూర్తి చేసుకుని ప్రభాస్ ఫ్రీ అవ్వడంతో -దర్శకుడు రాధాకృష్ణ తరువాతి షెడ్యూల్‌కు ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాడట. యూరోప్ నేపథ్యంగా సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీ -జాన్ (ప్రచారంలోవున్న టైటిల్). ప్రభాస్‌తో పూజాహగ్దె రొమాన్స్ చేయనుంది. అయితే, సినిమా తాజా షెడ్యూల్ వచ్చేవారం నుంచి మొదలవుతుందని సమాచారం. యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథే అయినప్పటికీ, బడ్జెట్ పరిమితుల రీత్యా హైదరాబాద్‌లోనే సెట్‌వేసి షూటింగ్ కానిచ్చేయాలన్న ఆలోచనతో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చేవారం నుంచి షూట్ మొదలెట్టేందుకు అందుకు అనుగుణంగా నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, తాజా షెడ్యూల్‌కు హీరోయిన్ పూజా హెగ్దె దూరంగాఉండే అవకాశాలే ఉన్నాయట. ప్రభాస్‌పై కొన్ని సన్నివేశాలు మాత్రమే దర్శకుడు రాధాకృష్ణ షూట్ చేయనున్నాడని అంటున్నారు. అయితే ఈ షెడ్యూల్‌కే పూజ దూరంగా ఉంటుందా? లేదా ఆమెను పూర్తిగా పక్కనపెట్టే ఆలోచన ఉందా? అన్న సందేహాలూ లేకపోలేదు. యువీ క్రియేషన్స్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నాడు.