వరల్డ్ ఫేమస్ రైటర్ లవర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ చేస్తోన్న తాజా చిత్రం -వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, కేథరిన్ ధ్రెస్సా, ఐశ్వర్య రాజేష్ నాయికలు. ఈవారంతో షూటింగ్ పార్ట్ పూర్తికానున్నట్టు చిత్రబృందం చెబుతోంది. అప్‌డేట్ ఏంటంటే -ఇప్పటి వరకూ చేయని రైటర్ పాత్రను విజయ్ దేవరకొండ చేస్తున్నాడట. కథా రచయితగా కనిపిస్తాడని, రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయని అంటున్నారు. ఇలా భిన్నమైన కథాంశంతో సినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా కథలతో ఇప్పటికే హాలీవుడ్ మార్క్ చిత్రాలు చాలానే వచ్చాయి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తోన్న సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడు. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఫిబ్రవరి 14న సినిమా విడుదలయ్యే అవకాశముంది.