ఛలో ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ ఇమేజ్ రాకున్నా, కెరీర్ ఆరంభంనుంచీ క్యూట్ హీరోయిన్‌గా రాశికి మంచి మార్కులే పడ్డాయి. తన అందంతో తెలుగు తెరపై మంచి మార్కులే కొట్టేసింది రాశి. కెరీర్ ఆరంభం నుంచీ హడావుడి లేకుండా కూల్‌గా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అడపాతడపా పడే హిట్సే ఆటుపోట్లు లేకుండా ఆమె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇటీవలి కాలంలో సౌత్‌లో వరుస సినిమాలు పడటం, టాలీవుడ్ కెరీర్ ఆశాజనకం కావడంతో ఇక్కడే సెటిలయ్యే ప్రణాళికలు వేసుకోవడం తెలిసిందే. అందులో భాగంగానే -గచ్చిబౌలిలో ఓ ఖరీదైన ఇంటినీ కొనుగోలు చేసింది రాశిఖన్నా. అయితే కెరీర్ అనుకున్నంత స్పీడ్ లేకపోవడం, కోలీవుడ్‌లోనూ దిక్కులు చూడాల్సి వస్తుండటంతో -ముంబయికి మకాం మార్చే నిర్ణయానికి వచ్చేందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘గచ్చిబౌలి’ ఇంటిని రెంట్‌కి ఇచ్చేసిందన్న టాక్ లేకపోలేదు. ముంబయి నిర్ణయానికి బలమైన కారణం -రకుల్‌ప్రీత్ అయి ఉండొచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాశికి రకుల్ మంచి స్నేహితురాలు. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన రకుల్, అనంతర ఫ్లాప్స్‌తో అవకాశాలు కోల్పోయింది. నార్త్‌గాళ్‌గా బాలీవుడ్‌లో కొద్దిపాటి చాన్స్‌లు రావడంతో -అక్కడే సెటిలయ్యే ప్రణాళికల్లో ఉంది. తన స్నేహితురాలి సజెషన్‌తో ఇప్పుడు రాశిఖన్నా సైతం -బాలీవుడ్ ప్రయత్నాల్లో నిమగ్నమవుతుందన్న టాక్ లేకపోలేదు. కారణమేదైనా -రాశి ముంయికి చెక్కేయడం ఖాయమట. దక్షిణాది అవకాశాలనూ ముంబయి నుంచే చక్కబెట్టనుందని అంటున్నారు. ఈ బ్యూటీ స్కెచ్ ఎంతవరకూ వర్కౌటవుతుందో చూడాలి.