అదృష్టం ఆవగింజంత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్‌ని సరికొత్తగా చూపిస్తూ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రం -్భష్మ. సింగిల్ ఫర్ ఎవర్ అన్నది ట్యాగ్‌లైన్. నితిన్‌తో తొలిసారి రష్మిక జోడీకట్టింది. ఈ సినిమాకు సంబంధించి ఆదివారం టీజర్ విడుదలైంది. ‘పెద్ద కార్పొరేట్ కంపెనీ చైర్మన్‌కు ఓ ప్రశ్న ఎదురవుతుంది. మీ తరువాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు? అన్న ప్రశ్నకు -నాకు క్వాలిఫికేషన్ కన్నా క్వాలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అంటూ తన వారసుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తాడు. ఆ వ్యక్తి నితిన్ అన్నది అర్థమయ్యేలా టీజర్ కట్ చేశారు. ఇంట్రోలోనే రౌడీలను చితక్కొడుతూ కనిపిస్తాడు నితిన్. అలాగే ఇంటర్వ్యూ తరహాలో సంపత్ పేరు అడిగితే, భీష్మ అంటూ నితిన్ ఇచ్చే సమాధానం, ప్రతిగా సంపత్ రాజ్ ‘్భష్మ కాదు భీష్మ సర్’ అనాలని అనడం, కౌంటర్‌గా నితిన్ ‘అంటే.. నా పేరుకు సర్ యాడ్ చేస్తే ఏం బాగోదు’ అంటూ అతి వినయం చూపించటం ఆసక్తికరంగా అనిపించింది. ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే, దురదృష్టం దబ్బకాయంత ఉంది’ అంటూ నితిన్ తన పరిస్థితిని పంచ్‌లో చెప్పడమూ బావుంది. బతుకును కోడితో పోల్చిచెప్పే సన్నివేశం, పక్కన రఘుబాబు, వెనె్నల కిషోర్ కామెడీనీ టీజర్‌లో కట్ చేయడం -్భష్మపై ఆసక్తి పెరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో -్ఫబ్రవరి 21న సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.