ఇమేజ్ లెక్కలు నాకుపట్టవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా చూస్తే
-ఎంత మంచోడో
అనిపించటం ఖాయం.
ఆల్ ఈజ్ వెల్ అనుకునే వ్యక్తి జర్నీ ఇది. మనుషులంతా మంచోళ్లేనన్న కానె్సప్ట్‌ను బలంగా అందించేది కూడా.
**
అతనొక్కడే నుంచి 118 వరకూ వైవిధ్యమైన చిత్రాలతో ఆడియన్స్‌ని మెప్పించిన హీరో కల్యాణ్‌రామ్. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ తాజాగా కల్యాణ్‌తో చేసిన తొలి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ -ఎంత మంచివాడవురా. శతమానం భవతి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ వేగెశ్న దర్శకుడు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోమవారం మీడియాతో ముచ్చటించాడు హీరో కల్యాణ్‌రామ్.
టైటిల్ జస్ట్ఫికేషన్?
నిరంతరం ఓ పాజిటివ్ వైబ్‌లోవుండే వ్యక్తి జర్నీ ఈ కథ. ఇతరులతో రిలేట్ అవుతూ వాళ్లకు కావాల్సిన ఎమోషన్స్‌ని అందించే మనస్తత్వం అతనిది. అందుకే ‘ఆల్ ఈజ్ వెల్’ అని పెట్టాలనుకున్నాం. కథ, కథనాల్లోనే కాదు పేరులోనూ తెలుగుదనం కోరుకునే దర్శకుడు సతీష్ వేగెశ్న కథానుగుణంగా ‘ఎంత మంచివాడవురా’ టైటిల్ సజెస్ట్ చేశారు. ఓవరాల్‌గా మనుషులంటేనే మంచోళ్లు. ఒక్కోసారి వాళ్లు చెసే తప్పులో, పొరబాట్లో వాళ్లకు తెలియజెప్పాలన్నది సినిమా కానె్సప్ట్.
‘ఆల్ ఈజ్ వెల్’లో కాన్ఫ్లిక్ట్ తావేదీ?
ప్రతి మనిషి కథలోనూ ఏదొక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. భిన్న మనస్తత్వాలు, ఆలోచనలున్న వ్యక్తుల జీవితాల్లోకి కథానాయకుడు ప్రవేశించి -వాళ్లలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడన్నదే కథలోని ముఖ్యాంశం. సో, కాన్ఫ్లిక్ట్ లేదని చెప్పలేం.
సినిమాతో వచ్చే ఇమేజ్?
ఇమేజ్‌ను ఫీలైతే అలా ఆలోచించాలి. నేనెప్పుడూ ఇమేజ్‌ను పట్టించుకోలేదు. కథ నచ్చితే సినిమా చేస్తానంతే. సాధ్యమైనంత వరకూ రిపిటేషన్ లేకుండా చూసుకుంటా. మనమేం చూపించినా ఆడియన్స్ కొత్తగా ఫీలవ్వాలన్నదే నా తపన. 118 తరువాత నా దగ్గరకు థ్రిల్లర్ కథలు చాలావచ్చాయి. చేయాలనిపించలేదు. శతమానంభవతి చిత్రం చూశాక -అలాంటి సినిమా చేస్తే బావుంటుదని హితులు, సన్నిహితులు సజెస్ట్ చేశారు. అలాంటి కథ నావరకూ రావాలిగా అనుకునేవాడిని. వచ్చింది, చేశాను. సో, ఇందులో ఇమేజ్ థాట్ లేదు.
వేగంగా పూరె్తైనట్టుంది?
అలాంటిదేం లేదు. ప్రాసెస్‌లోనే చేశాంగానీ, గ్యాప్ తీసుకోకుండా అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోయాయి అంతే. 118 తరువాత ఓరోజు కృష్ణఅపసాద్ కలిసి ఓ గుజరాతీ సినిమాను ప్రస్తావించారు. ఆ సినిమా చూసినపుడు ‘కోర్’ కంటెంట్ మాత్రమే నచ్చింది. కోర్‌ను బేస్ చేసుకుని మన నేటివిటీకి తగ్గట్టు సతీశ్ వేగెశ్న చేసిన బ్యాలెన్సింగ్ స్టోరీ బాగా కనెక్టైంది. వెంటనే ఓకే చేసేశాను.
మీ లైఫ్‌కి కనెక్టయ్యే పాయింట్?
లైఫ్‌కి కనెక్టయ్యే మోర్ డ్రామా అంటూ ఇందులో ఉండదు. బట్, కొన్ని సన్నివేశాల్లోని ఎమోషన్స్ దాదాపు అందరి లైఫ్‌కీ కనెక్టవ్వొచ్చు. నావరకూ -ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను. తరువాత వేర్వేరు ఫ్యామిలీలయ్యాయి. బంధువర్గమంతా ఎప్పుడైనా కలిసినపుడు -ఇంకొన్ని రోజులుంటే బావుండనే ఫీలింగ్ వెంటాడుతుంది. ఇలాంటివి చాలామంది లైఫ్‌ల్లో తారసపడతాయి. అలాంటి కనెక్టివిటీ కంటెంట్ -ఎంత మంచివాడవురాలో చూస్తారు.
పాత్ర కష్టమైందా?
సులువని మాత్రం చెప్పను. డ్రామాలేని సింపుల్ క్యారెక్టర్‌ని స్క్రీన్‌మీద క్యారీ చేయడం కష్టమే. పైగా, కంటి చూపులోనూ నవ్వు కనిపించాలన్న దర్శకుడి సజెషన్ అంత ఈజీ అనిపించలేదు. రియల్ లైఫ్‌లో నేనెప్పుడూ సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండేందుకే ప్రయత్నిస్తా. అది ఈ క్యారెక్టర్‌కి వర్కౌటై ఉండొచ్చు.
ఎంత.. జర్నీ?
70రోజులు హ్యాపీగా షూట్ చేశాం. మొబైల్ సిగ్నల్స్ అందని కొన్ని రిమోట్ లొకేషన్స్‌లోనూ షూటింగ్ జరిగింది. అక్కడ మొబైలో, మరో వ్యాపకమంటూ ఉండదు కనుక -టీం మొత్తం సెట్స్‌లో హాయిగా గడిపేవాళ్లం. ఇట్స్ ఏ గుడ్ జర్నీ.
సంక్రాంతి రేసులో..?
మీరంటున్న రేసు ప్రతి సంక్రాంతికి ఉండేదే. నిజానికి సినిమా వాళ్లకు ఈ సీజన్ ఓ పండగ. ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూస్తారు కనుక -ఆ ఆనందమే వేరుంటుంది. అందుకే, ఈ సీజన్‌లో ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రావడం కామనైంది. రేసులు, సవారీలు మాట్లాడుకోడానికే తప్ప అలాంటి పరిస్థితి ఉండదనే నమ్ముతా. నచ్చిన సినిమాను ఆడియన్స్ చూస్తారంతే.
దర్శకుడితో వర్క్?
హ్యాపీ అండ్ కంఫర్ట్. ఇంతకుముందు పూరి, అనిల్ రావిపూడితో నాకు సింకైనట్టే.. సతీశ్‌తోనూ కంఫర్ట్ ఫీలయ్యా. ఎప్పుడైనా టెన్షన్ కనిపిస్తే -నాలుగు జోకులుచెప్పి రిలాక్స్ చేసి షూట్‌కి తీసుకెళ్లేవారు. అలా కంఫర్ట్‌బుల్ ఫేజ్‌లోనే సినిమా ముగించా.
నిర్మాతలు/ మెహరీన్‌తో..?
మెహరీన్‌కు మంచి పాత్ర పడింది. ఆమె పాత్ర అందరికీ కనెక్టవుతుంది. ఇక మ్యూజిక్ రంగంలో అగ్రగామిగావున్న ఆదిత్య సంస్థ నిర్మాణ రంగానికి రావడం హ్యాపీ. ఖర్చుగురించి ఆలోచించకుండా సినిమా తీశారు.
సంగీతం..?
నిన్న కోరి చిత్రానికి గోపీసుందర్ ఇచ్చిన సూదింగ్ మ్యూజిక్ బావుంది. ఈ కథతో గోపీసుందర్ నుంచి అలాంటి మ్యూజిక్ తీసుకునే అవకాశం వచ్చింది. అద్భుతమైన సంగీతం, హాయినిచ్చే బాణీలు. తెరపై మరింత అందంగా వచ్చాయి. ఏమో ఏమో ఏ గుండెల్లో.. అన్న పాట వింటే కథాసారం మొత్తం అర్థమవుతుంది.