ఛాన్స్ అలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ భాషలోనైనా -ఒక పెద్ద హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గర బాల్చీ తనే్నసిందంటే అందుకు వంద కారణాలుంటాయి. కాకపోతే ప్రాజెక్టుని లీడ్ చేసిన దర్శకుడే బలైపోతుంటాడు. తెలుగులో ఆమధ్య బాలకృష్ణ చేసిన రూలర్ ఫ్లాప్ చిత్రంగా టాక్ తెచ్చుకుంది. అంతకు ముందొచ్చిన జైసింహా పరిస్థితీ అదే అయ్యింది. దీంతో బాలయ్య ఫ్లాప్‌లకు అతనే కారణమంటూ -తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ మాటలుపడక తప్పలేదు. అయితే, ఒకప్పుడు మంచి హిట్లు తీసిన కెఎస్ రవికుమార్‌కు సినిమా లేకుండా పోలేదు. కెఎస్ రవికుమార్‌కు -తమిళ స్టార్ హీరో అజిత్ అవకాశమిచ్చాడట. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘విలన్’ సెనే్సషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. ఆ సినిమాతో తనను స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లిన రవికుమార్ స్టామినాపై పూర్తి నమ్మకంతోనే అజిత్ ప్రాజెక్టు అప్పగిస్తున్నాడన్న టాక్ తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తన అనుకున్న వాళ్లకు లిఫ్టివ్వడంలో అజిత్ అగ్రభాగాన ఉంటాడన్న మాట ఎలాగూ ఉంది. అన్నీ కలిసొచ్చి -రవికుమార్‌కు ప్రాజెక్టు దక్కింది. అజిత్‌తో హిట్టు కొట్టి కెఎస్ రవికుమార్ మళ్లీ మెయిన్ స్ట్రీమ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.