వ్యతిరేకించినోళ్లే సపోర్ట్ చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిగ్రీ కాలేజ్ సినిమాను విడుదలకు ముందు వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు బాగుందని చెబుతున్నారు. వౌత్ టాక్‌తోనే ఈ చిత్రం హిట్ రేంజ్‌లో దూసుకువెళుతోంది అని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ సినిమా పతాకంతో వరుణ్, దివ్యారావు జంటగా రూపొందిన డిగ్రీకాలేజ్ చిత్రం ఈనెల 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పోస్టర్లను చూసి థియేటర్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే సినిమా చూశాక మనసుకు హత్తుకునే కథనం ఉందని ప్రశంసిస్తున్నారని, కేవలం కొన్ని రొమాన్స్ సీన్స్ చూసి, సినిమాపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పర్చుకోవద్దని మా మనవి అని అన్నారు. సినిమా చూశాకే ఎవరైనా మాట్లాడమని తాము మొదటే కోరామని, బలమైన కంటెంట్, క్లైమాక్స్ సన్నివేశాల్లో భావోద్వేగం, కులవ్యవస్థ మీద తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. మొదటి మూడు రోజులు కలక్షన్లు పెరగకపోయినా సోమవారంనుండి వౌత్ టాక్‌తో ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, మంచి సినిమా మరోసారి విజయం సాధిస్తుందన్న నమ్మకం కుదిరిందని ఆయన వివరించారు. సందేశాత్మకంగా యువతకోసం రూపొందించిన ఈ చిత్రం విజయం పొందడం ఆనందంగా ఉందని, హీరోహీరోయిన్లు వరుణ్, దివ్యారావు తెలిపారు. కార్యక్రమంలో రవిరెడ్డి, ఆలేటి శ్రీనివాసరావు, మదన్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.