సీనియర్ సినీ జర్నలిస్టు రామారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమలో దగ్గజాలవంటి ఎందరో మహా నటులపై అనేక వ్యాసాలు రాసి, పాత్రికేయుడిగా పలువురి మన్ననలు అందుకున్న సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు దాదాపు 72 సంవత్సరాలు. యూరిన్ ఇనె్ఫక్షన్‌కు గురి కావడంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాగా మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 80వ దశకంనుండి కలం దించకుండా సినిమానే ప్రపంచంగా జీవించిన పసుపులేటి రామారావు దూరమవ్వడాన్ని అటు పరిశ్రమలోను, ఇటు సినీ జర్నలిస్టుల లోకం జీర్ణించుకోలేకపోతోంది. వామపక్ష భావాలతో తణుకు నుండి డిగ్రీ పట్టా పుచ్చుకుని, ప్రజానాట్యమండలిలో యాక్టివ్ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత సినిమా జర్నలిస్టుగా విశాలాంధ్ర, జ్యోతిచిత్ర తదితర పత్రికలలో అనేక వేల వ్యాసాలను రాశారు. ముఖ్యంగా చిరంజీవిపై ఆయన అందించిన పుస్తకాలు సినీ జర్నలిస్టులకు కరదీపికలుగా మారాయి. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామారావు తనకెంతో ఆప్తుడని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి కోరారు. పత్రికా లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.