పూజా.. మజాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం కలిసొస్తే.. ఐరెన్ లెగ్‌లు కూడా గోల్డెన్ లెగ్‌లవుతాయి. ప్రస్తుతం పూజాహెగ్దె గోల్డెన్ లెగ్‌తోనే కెరీర్‌ని నడిపిస్తోంది. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో చేతిలో సినిమాలే లేని పరిస్థితి ఎదుర్కొన్న పూజ.. ఇప్పుడు ఏ ప్రాజెక్టును ఒప్పుకోవాలా? అన్నత బిజీ అయిపోతోంది. తెలుగులోని స్టార్ హీరోలంతా ‘పూజ’ పేరు జపిస్తుంటే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన పూజ మొత్తానికి అక్కడ భారీ అవకాశానే్న అందుకుంది. బాలీవుడ్‌లో పూజ చేసిన ‘మొహంజొదారో’ డిజాస్టర్ కావడంతో అవకాశాలు తెరమరుగయ్యాయి. చాలా గ్యాప్ తరువాత ‘హౌస్‌ఫుల్ -4’లో అవకాశం అందుకుంది. ఆ సినిమాకు ఓకే అనిపించుకోవడంతో -పూజ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు పడుతుండటంపై టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది పూజ. ఇప్పుడు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు పడుతున్న టైంలో -బాలీవుడ్‌లో ఏకంగా సల్మాన్‌కు జోడీగా చాన్స్ వచ్చిందట. సల్మాన్‌తో సాజిత్ నడియావాలా నిర్మించనున్న ‘కబి ఈద్ కబి దివాలి’లో పూజకు గోల్డెన్ చాన్స్ తగిలింది. సల్మాన్‌తో పూజ కాంబినేషన్ ఇదే ఫస్ట్‌టైం. ఫర్హాద్ సంజీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా 2021 ఈద్ పండగకు విడుదలవుతుందట.