ఆచార్యపై.. ‘కె’ ప్లాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిదెల.. కొరటాల (‘కె’-టీం) కాంబొలో రానున్న ప్రతిష్టాత్మక సోషల్ సబ్జెక్టు -ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి హీరో కనుక -అనుపానులన్నీ చూసుకునే సినిమా మొదలెట్టారు. కాకపోతే -జక్కన్న దిగ్గజ ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్‌లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు -‘కె’ ప్రాజెక్టుకు కంటకంగా మారినట్టు కనిపిస్తోంది. జక్కన్న తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్‌లో రామరాజు పాత్రను -రామ్‌చరణ్ చేస్తున్నాడు. రాజవౌళి ప్రాజెక్టులోకి అడుగుపెడితే.. సమాంతరంగా మరో ప్రాజెక్టు చేసే అవకాశం ఈ హీరోకీ ఉండదన్నది తెలిసిందే. ఆర్టిస్టులంతా అందుబాటులో ఉండాలని రాజవౌళి కోరుకుంటాడు. అయితే, జూలై 2020లో ట్రిపుల్ ఆర్‌ను థియేటర్లకు తెస్తానన్నది సినిమా ఆరంభించినపుడు రాజవౌళి చెప్పిన మాట. ఆ లెక్కల్ని చూసుకునే -కాస్త ఆలస్యంగా ఆచార్య ప్రాజెక్టు మొదలెట్టాడు కొరటాల. అయితే, అనేక కారణాలతో ట్రిపుల్ ఆర్ ఆలస్యమై -విడుదల తేదీ 2021 సంక్రాంతికి చేరింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ‘ఆచార్య’ ప్రాజెక్టుపై కనిపిస్తోందట. ఆచార్యను -అక్టోబర్‌లోనే థియేటర్లకు తెచ్చే ఆలోచన చేస్తున్నా.. అప్పటి పూర్తవుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు. సాధ్యమైనంత వేగంగా సినిమాను పూర్తి చేయాలన్న చిరంజీవి మాటమేరకు -దర్శకుడు కొరటాల పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నా.. స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించే రామ్‌చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ షూట్‌కి ప్లాన్ సెట్ కావట్లేదన్న కథనాలొస్తున్నాయి. గెస్ట్ అప్పియరెనే్స అయినా.. చరణ్‌ది 30 నిమిషాల నిడివివున్న పాత్ర కనుక ఎక్కువ డేట్స్ అవసరమట. ఇదే టైంలో ట్రిపుల్ ఆర్ షూటింగ్ సైతం వేగం అందుకోవడంతో -అనుకున్న టైంలో ఆచార్య ప్రాజెక్టుకు రామ్‌చరణ్ డేట్స్ ఇవ్వగలుగుతాడా? అన్నది డౌటే. అదే సాధ్యం కాకపోతే -ఆచార్య ప్రాజెక్టు వచ్చే వేసవికి మార్చుకోవాల్సి వస్తుంది. కొరటాల అప్పటి వరకూ ఆగగలడా? అన్నదీ సందేహమే. సో, ఈ హర్డిల్‌ను ‘కె’-టీం ఎలా ఓవర్‌కమ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఇదిలావుంటే, ఆచార్యలో హీరో చిరుకి జోడీగా త్రిష కనిపించనుంటే, రామ్‌చరణ్‌కు జోడీగా సమంతను ఒప్పించినట్టు తెలుస్తోంది. ‘రంగస్థలం’ చిత్రంతో చరణ్-సమంత కాంబినేషన్‌కు మంచి రిజల్ట్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సామ్‌ను ఎంపిక చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. చరణ్ డేట్స్ ఫిక్సయితే -రాజమండ్రిలో మొదలుపెట్టే షెడ్యూల్‌లోనే సామ్ బోర్డ్‌లోకి రావొచ్చని అంటున్నారు.