చావుకబురు చల్లగా.. చెబుతాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ఏ పాత్రకైనా సిద్ధమేనని చెప్పే హీరో -కార్తికేయ. అందుకే ప్రాధాన్యతను బట్టి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకు సైతం నో చెప్పకుండా చేస్తున్నాడు. అయితే, ఆర్‌ఎక్స్ 100 తరువాత అంత ఇంపాక్ట్ చూపించే సినిమా ఒక్కటీ కార్తికేయకు పడలేదు. చేసిన చిత్రాలన్నీ నిరుత్సాహపర్చాయి. అలాంటి తరుణంలో కార్తికేయ మరో సినిమా మొదలెట్టాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించనున్న సినిమా -చావుకబురు చల్లగా. సినిమాలో కార్తికేయను బస్తీ బాలరాజుగా చూపిస్తాడట కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి. ఈ ప్రాజెక్టు నుంచి -స్వర్గపురి వాహనంపై నిలబడి దమ్ము కొడుతున్న బస్తీ బాలరాజు లుక్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సైతం విడుదల చేసింది చిత్రబృందం. గళ్ల షర్ట్, పైకి కట్టిన లుంగీ.. తనదైన మాస్ట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు కార్తికేయ. ఫస్ట్‌టైం కార్తికేయతో లావణ్య త్రిపాఠి రొమాన్స్ చేయనుంది. జాక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత్ క్లాప్‌నివ్వగా, అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కెమెరా స్విచాన్ చేశారు. ముహ్తూరపు సన్నివేశానికి అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సునీల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.