అట్లీ.. షారుఖ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీరో’ తరువాత బాలీవుడ్‌లో షారుఖ్ మాట వినిపించటం లేదు. దాదాపుగా ఏడాదిన్నరగా ప్రాజెక్టు ఇదిగో అదిగో అన్న అలికిడి తప్ప, అసలు విషయం బయటకు రాలేదు. లాంగ్ గ్యాప్ తరువాత -బాలీవుడ్‌లో మళ్లీ షారుఖ్ ‘విజిల్’ వినిపిస్తోంది. వరుస ఫ్లాపులతో ‘జీరో’ అయిపోయిన షారుఖ్‌ని -లేపి నిలబెట్టే బాధ్యతను తమిళ దర్శకుడు అట్లీ తీసుకున్నట్టు తెలుస్తోంది. సౌత్ డైరెక్టర్‌గా వరుసపెట్టి నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు అట్లీ. అట్లీతో షారుఖ్ ప్రాజెక్టు ఉంటుందంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. విజయ్‌తో ‘బిగిల్’ హిట్టుకొట్టిన అట్లీ, ఆ తరువాత ఏ స్టార్ హీరోనూ అప్రోచ్ కాకపోవడం -కథనం నిజమే అయివుంటుందన్న అంచనాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం అట్లీ స్క్రిప్ట్‌ను షారుఖ్ ఓకే చేశాడట. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిపి సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌పై ప్రాజెక్టు తెరకెక్కొచ్చని, వచ్చే వేసవిలో ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లొచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశమేమంటే -ఈ ప్రాజెక్టులో తమిళ స్టార్ విజయ్ ఓ కామియో రోల్ చేయనున్నాడని. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయితే, కెరీర్ గ్రాఫ్‌లో కిందపడిన షారుఖ్ పైకి లేస్తాడేమో చూడాలి.