నా కెరీర్‌లో స్పెషల్... పలాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, నక్షత్ర జోడీగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో మాట్లాడాడు.
* నటుడిగా నా కెరీర్‌లో పలాస ఓ స్పెషల్. మైండ్ గేమ్‌గా వేరియేషన్స్‌తో సాగే నెగెటివ్ రోల్ చేశా. విలన్ రోల్ కోసం జుట్టుపెంచి మేకప్ లేకుండా చేశా. ఇంద్రుడు చంద్రుడులో కమల్ పాత్రకు కాస్త దగ్గరగా ఉంటుంది.
* సంగీత దర్శకుడిగానూ పలాస ప్రత్యేకమే. కథను రక్తికట్టించే నేపథ్య సంగీతం కోసం భిన్నమైన వాద్యపరికరాలను వాడాను.
* పాత్రల్లో బోరింగ్ లేకుండా సినిమా సహజంగా అనిపిస్తుంది. ఫ్రెష్ స్క్రీన్ ప్లే. సో, కొన్నిచోట్ల రీ రికార్డింగ్ అవసరం రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పికప్ చేసుకుని -తరువాత ఓ పాత్ర చేయమని దర్శకుడు చెప్పడంతో కథ నచ్చి చేశా. నా డైలాగులు ఉత్తరాంధ్ర మాండలికంలో ఉంటాయి.
* సినిమాలో ఐదు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. జానపద కళవున్న సినిమా కనుక -కొత్తదనం కోసం ఐదుగురు సింగర్స్‌ని పరిచయం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో సాగిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
* పలాసలో నేను చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త సినిమాల్లో నాకు కొన్ని పాత్రల్ని ఆఫర్ చేస్తున్నాం. వాటి వివరాలు త్వరలోనే చెబుతా.