మళ్లీ.. ఢీ’కొడతారట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు శీను వైట్ల కెరీర్‌లో ఎవర్ గ్రీన్ సినిమా - ఢీ. హీరోగా మంచు విష్ణుకీ గొప్ప ఎలివేషన్ ఇచ్చిన సినిమా. వినోదభరిత చిత్రంగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన ఢీ -శీను వైట్లను పెద్ద దర్శకుల వరుసలోకి నెట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు విష్ణు. ఓ ఇంటర్వ్యూలో ‘ఢీ’ విషయాన్ని ప్రస్తావిస్తూ -ఇంతవరకూ నేను చేసిన సినమాల్లో బాగా ఇష్టమైన సినిమా అది. అన్నివర్గాల ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకున్న చిత్రమది. అలాంటి చిత్రానికి సీక్వెల్ తెచ్చే సన్నాహాలు చేస్తున్నాం అంటున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే దర్శకుడు శీను వైట్ల వెల్లడిస్తాడని అన్నాడు. ప్రస్తుతం విష్ణు కెరీర్ కాస్త డౌన్‌ఫాల్‌గానే ఉంది. గొప్ప దర్శకుడు అనిపించుకున్న శీను వైట్లకు సినిమాలే లేకుండా పోయాయి. సో, క్రైసిస్ కాలంలో హిట్టుకు సీక్వెల్ తేవడానికి ఇద్దరూ సిద్ధపడటం ఆసక్తికరమైన విషయమేమీ కాదు. కాకపోతే - ఢీ రేంజికి తగ్గని సీక్వెల్ స్టోరీ ఏమై వుంటుందా? అన్నదే ఆసక్తికరం. డల్‌గా సాగుతోన్న ఇద్దరి కెరీర్‌కి - ఢీ 2 కొత్త ఊపునిస్తుందేమో చూద్దాం.