ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంగా ఆలోచించగలిగితే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే -అంటున్నాడు శివ కార్తికేయన్. పిఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన తాజా సినిమా -శక్తి. విభిన్న కథలు.. విలక్షన పాత్రలతో హీరోగా సెపరేట్ ట్రాక్ వేసుకున్న శివ కార్తికేయన్ -తమిళంలో ‘హీరో’తో మంచి హిట్టందుకున్నాడు. తమిళంలో హిట్టయిన హీరోని -తెలుగులో ‘శక్తి’గా 20న విడుదల చేస్తున్నాడు నిర్మాత కోటపాడి జె రాజేష్. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ఈ సినిమాతో తొలిసారి సౌత్‌లోకి ఎంటరయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ట్రైలర్‌ను వదిలింది చిత్రబృందం. ‘చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని’లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన సినిమాలో అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజైన సందర్భంలో దర్శకుడు పిఎస్ మిత్రన్ మాట్లాడుతూ -విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై ఓ సాధారణ కుర్రాడు సూపర్ హీరోలా మారి ఎలా పోరాడాడన్నదే ప్రధాన కథ. ఇది ఏ భాషకైనా కనెక్టయ్యే కానె్సప్ట్. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాం అన్నారు. నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ -వైవిధ్యమైన కథాంశం లేకపోతే శివకార్తికేయన్ సినిమా చేయడు. ఇదొక యూనివర్శల్ సబ్జెక్టు. సినిమా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది అన్నారు.