టైమొచ్చినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి రీతూవర్మ. తరువాత విజయ్ దేవరకొండతో మూడో చిత్రం చేసిన రీతూవర్మకు -పెళ్లిచూపులు హిట్‌తో వరుస అవకాశాలు వస్తాయనే అనుకున్నారు. పెళ్లిచూపులు క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ అకౌంట్‌లో పడి -సెనే్సషన్ హీరోగా ఎదిగినా.. ఆ సినిమా చేసిన రీతూవర్మకు మాత్రం చాన్స్‌లు లేకుండా పోయాయి. దీంతో కోలీవుడ్‌కు షిప్టయిన రీతుకూ -అక్కడా చాన్స్‌లు చిన్నచూపే చూశాయి. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లో గట్టి ప్రయత్నాలు చేస్తున్నా -కెరీర్ ముందుకెళ్లలేదు. తాజాగా ఆమె నటించిన మలయాళ చిత్రం తెలుగులోకి -కనులు కనులను దోచాయంటే టైటిల్‌తో అనువాదమైంది. దుల్కర్ సల్మాన్‌కు జోడీగా రీతూవర్మ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, సినిమాకు మంచి అప్లాజ్ రావడంతో.. రీతుకు చాన్స్‌లు రావొచ్చన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం రీతు చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. నానితో టక్ జగదీష్ చేస్తుంటే, శర్వానంద్ సరసనా మరో ప్రాజెక్టులో చాన్స్ వచ్చిందట. సో, రీతూవర్మ టైం వచ్చిందన్న మాట.