సానా’వుందిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌కి కొత్త దర్శకుల పోటెక్కువైంది. వచ్చేవాళ్లొస్తున్నారు. ఒకటో సినిమాతోనే మాయమైపోతున్నారు. ప్రతి సీజన్‌కూ వచ్చే పదిమందిలో ఏ ఒక్కడో మాత్రమే -ఓకే, ఫరవాలేదు, నిలబడతాడు అనిపించుకునేది. ఈ సీజన్‌లో ఆ కోవలో సానా బుచ్చిబాబు పేరు వినిపిస్తోంది. తీసిన సినిమా థియేటర్లకు రాకముందే -ఏం తీశాడో చూపిస్తోన్న ప్రమోషనల్ బిట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. విడుదలకు సిద్ధమవుతున్న చాలా సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తున్నా -బుచ్చిబాబు పనితనంలో గ్రేస్ కనిపిస్తోందన్న మాట ఇప్పటికే వినిపిస్తోంది. కొత్త దర్శకుడిగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా -ఉప్పెన. మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న కొత్త హీరో వైష్ణవ్‌తేజ్‌ను తెరమీద చూపించే దర్శకుడిగా చాన్స్ అందుకున్నాడు. అలా మొదలైందే -ఉప్పెన. టైటిల్ డిజైన్ నుంచి సాంగ్ ప్రొమోస్ వరకూ అతని పనిలో ఫ్రెష్‌నెస్ కనిపిస్తోందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. చదివిన స్కూల్ పెద్దది కనుక.. ఆమాత్రం గ్రేస్ చూపించటంలో ఆశ్చర్యమేముందనే వాళ్లూ లేకపోలేదు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన కుర్రాడు బుచ్చిబాబు. సుక్కూ దగ్గర శిష్యరికం చేస్తూ -ఉప్పెనతో డైరెక్టరయ్యాడు. లోప్రొఫైల్‌తో మొదలైన ఉప్పెనకు ఇప్పుడు మంచి క్రేజ్ కనిపిస్తోందంటే -బుచ్చిబాబు ‘వర్క్ క్వాలిటీ’యేనన్న మాట లేకపోలేదు. హీరో హీరోయిన్ల ప్రీలుక్ పోస్టర్లతో ఫ్రెష్‌ఫీల్‌నిస్తే, ప్రాజెక్టునుంచి విడుదలైన రెండు పాటలతో ఉప్పెన స్టామినా చూపించాడు. ‘నీ కన్ను నీలి సముద్రం/ నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అంటూ దేవీశ్రీ డిజైన్ చేసిచ్చిన ఫస్ట్ సాంగ్ ఇన్‌స్టంట్ హిట్టైంది. తాజాగా రిలీజ్ చేసిన -ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ సాంగ్ మోనాటనీకి భిన్నమన్న భావన కలిగిస్తోంది. రెండు పాటల్లోనూ విజువల్స్ సైతం వైవిధ్యంగా ఉండటంతో -సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రమోషనల్ గ్లింప్స్‌లో వైష్టవ్‌ను నార్మల్ కుర్రాడిగా చూపించటం, నిత్యశెట్టి ఎక్స్‌ప్రెషన్స్‌లోని బ్యూటీని అందంగా ప్రజెంట్ చేయడంలోనే బుచ్చిబాబు టేస్ట్ కనిపిస్తోంది. సో, కొత్త దర్శకుడు బుచ్చిబాబు ఏప్రిల్ 2న పూర్తి ప్రేమకావ్యాన్ని చూపించి -ఇండస్ట్రీలో ఉప్పెన సృష్టించటం ఖాయమన్న మాటే వినిపిస్తోంది.