జూలైలోనేనట?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భీష్మ హిట్టుతో కూల్ క్లౌడ్స్‌లో విహరిస్తున్నాడు హీరో నితిన్. అతని కెరీర్‌కు భీష్మ ఇచ్చిన ఆక్సిజన్ అంతా ఇంతా కాదు. ఆ ఉత్సాహంతోనే తరువాతి చిత్రం ‘రంగ్ దే’ను సైతం త్వరగా థియేటర్లకు తెచ్చే మూడ్‌లో ఉన్నాడట. హిట్టిచ్చిన ఉత్సాహంతో నితిన్ పూర్తి ఫోకస్ రంగ్ దేపై పెట్టడంతో -చిత్రీకరణ వేగంగా సాగుతోంది. కీలక సన్నివేశాల షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో -మిగిలిన ప్రాసెస్‌ను త్వరగా పూర్తి చేసి జూలై 30నే థియేటర్లకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న రంగ్ దేలో నితిన్‌తో కీర్తిసురేష్ రొమాన్స్ చేయనుంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రాజెక్టుకు ప్లస్‌పాయింట్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.