రజనీకి సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దర్శకుడు శివ తెరకెక్కిస్తోన్న చిత్రం -అన్నాత్తే. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్న రజనీ -ఈ సినిమాపై పెద్ద ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 23న సినిమాను విడుదల చేసే ప్రణాళికతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. రజనీ ఇమేజ్‌ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసు మీదపడుతున్నా -యూత్‌లో రజనీ ఫైర్ ఇంకా చల్లారలేదు. వరుస ఫ్లాపులిస్తున్నా -రజనీ నుంచి కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌లోను, ఆడియన్స్‌లోనూ మంచి జోష్ కనిపించటం పరిపాటి. రజనీ సెనే్సషనల్ హిట్టుకొట్టి చాలా కాలమైంది. అయినా -వచ్చే ప్రతి సినిమాపైనా ‘సెనే్సషనల్ హిట్టు’ కావొచ్చన్న అంచనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈసారి అన్నాత్తేపై అలాంటి అంచనాలే కనిపిస్తున్నాయి. అయితే రజనీ ఆశలపై యాష్ నీళ్లుపోస్తాడా? అన్న సందేహాలూ ముసురుతున్నాయి. రజనీ అన్నాత్తే రిలీజ్ డేట్ రోజునే యాష్ చేస్తున్న కేజీఫ్ సెకెండ్ చాప్టర్ సైతం థియేటర్లకు రానుంది. కేజీఎఫ్ హిట్టుతో కన్నడ స్టార్ యాష్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తమైంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై -బ్లాక్‌బస్టర్ అనిపించుకోవడం తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్‌చేసే వసూళ్లు రాబట్టడంతో -కేజీఫ్ సెకెండ్ చాప్టర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. అక్టోబర్ 23నే కేజీఎఫ్ సైతం విడుదల కానుండటంతో -యాష్‌పై రజనీ తన ప్రతాపం చూపిస్తాడా? అన్న సందేహాలు లేకపోలేదు. ఏదేమైనా -రెండు భారీ చిత్రాల మధ్య పోటీపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంటోంది.