రా’సెంటిమెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ ముసుగును తీసేసి -్ఫ్యమిలీ ఎమోషన్స్ లైన్‌ను ఎంచుకున్న సాయితేజ్ రెండు సినిమాలతో పూర్తిగా గాడిలో పడ్డాడు. ప్రస్తుతం సాయితేజ్ చేస్తున్న ప్రాజెక్టు -సోలో బతుకే సో బెటర్. మొన్నటి చిత్రలహరిలో ప్రతిభవున్నా దురదృష్టం వెంటాడే కుర్రాడి పాత్రతో మెప్పించిన సాయితేజ్ -ప్రతిరోజూ పండగే చిత్రంలో.. కొడుకులు పట్టించుకోకున్నా, చివరి క్షణాల్లో తాతను ఆనందంగా ఉంచాలని తలచిన మనవడి పాత్రతో ట్రాక్‌లోకి వచ్చేశాడనిపించాడు. రెండు చిత్రాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయితేజ్ -ఈసారి సోలో బతుకు స్టయిల్‌ని చూపించడానిక రెడీ అవుతున్నాడు. దర్శకుడు దేవకట్టా తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టులో సాయితేజ్‌తో నివేదా పేతురాజ్ జోడీ కడుతుండటం తెలిసిందే. అయితే, ప్రతిరోజూ పండగే చిత్రంలో ఎంజెలీనా పాత్రతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ తెచ్చిన ‘రాశిఖన్నా’ను సైతం సాయితేజ్ సెంటిమెంట్‌గా తీసుకుంటున్నాడట. పైగా ఇంతకుముందు సాయితేజ్ చేసిన సుప్రీం చిత్రానికీ రాశి అందాలు ఒకింత ఊరటయ్యాయి. రాశిఖన్నా సైతం ఎస్‌బిఎస్‌బి పాత్రపై ఆసక్తి చూపించటంతో -ఒక పాట, కొన్ని సన్నివేశాలతో ఆమెను డిజైన్ చేస్తున్నారట. సెంటిమెంట్ వర్కౌటైతే -తరువాత ప్రాజెక్టులో సాయితేజ్ సరసన రాశికి మళ్లీ ఫుల్‌లెంగ్త్ చాన్స్ దక్కడం ఖాయం.