కూలి తీసేసిన కరోనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తాజ్‌మహల్ అందాల వెనుక -రాళ్లెత్తిన కూలీలెందరో. ఇండస్ట్రీలోనూ బ్లాక్‌బస్టర్/ఫ్లప్ సినిమాల వెనుక చెమటోడ్చే శ్రామికులూ ఉంటారు. కరోనా దెబ్బకు టాలీవుడ్ బందవ్వడంతో -వేలాది శ్రామికుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సినీ కార్మికులంతా ఇప్పుడు అగమ్యగోచర స్థితినే ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడకుండా సినీ కార్మికుల ఆరోగ్య సంక్షేమానికి ఇండస్ట్రీ తీసుకున్న స్వచ్ఛంద బంద్ నిర్ణయాన్ని సమర్థించాలి, తప్పదు. పైగా ప్రభుత్వ ఆదేశం కూడా ఉంది కనుక -బంద్ అనివార్యం. మార్చి 31 వరకూ షూటింగ్‌లకు సెలవిచ్చారు కనుక -పనులుండవు. ఒకటి రెండు రోజులైతే ఓకే. పదిహేను రోజులంటే -పస్తుల మాటేంటన్న ప్రశ్న మొదలైంది. పదిహేను రోజులు మూతపడిన పరిశ్రమలో -ఆ తరువాత ఒక్కసారిగా పనులు మొదలవుతాయా? అంటే గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితీ ఉండదు. థియేటర్ల వ్యవస్థా మూతపడటంతో -దానిపై ఆధారపడిన వేలమంది చిన్న బతుకుల పరిస్థితీ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. తిండి కోసం ప్రత్యామ్నాయ కూలిని వెతుక్కోవడం ఇంతమందికీ ఒక్కసారిగా సాధ్యం కాదు. సినిమాపై ఆధారపడిన చిన్ని బతుకులకు ‘మెతుకు’ ఇబ్బందులు తప్పవన్న భయాందోళన కనిపిస్తోంది. మరోపక్క మేకర్లనూ ప్రస్తుత పరిస్థితి ఆందోళనలోకి నెడుతోంది. ‘వైరస్ ఇంపాక్ట్‌తో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి ఎంత మూల్యం చెల్లించుకుంటామన్నది ఇప్పుడే చెప్పలేం. చిన్న, పెద్ద నిర్మాతలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఏక మొత్తంగా చెప్పలేంగానీ, టాలీవుడ్‌పై మాత్రం ఆర్థికంగా బలమైన ఇంపాక్ట్ చూపించే పరిస్థితే కనిపిస్తోంది. ఆర్థిక నష్టాలు అనివార్యమే అయినా -ప్రజారోగ్యం అంతకంటే ముఖ్యం కనుక ఈ యుద్ధం తప్పదు. ఇంటు ఇండస్ట్రీలో నిర్మాణ వ్యవస్థ, ఇటు సినిమాను ప్రదర్శించే థియేటర్ల వ్యవస్థపైనా కరోనా ఒక అశనిపాతమే’ అంటున్నారు నిర్మాతలు. కరోనా దెబ్బతో మేకర్లకు ఆర్థిక కష్టాలు, శ్రామికులకు మెతుకు కష్టాలు తప్పని పరిస్థితే కనిపిస్తోంది.
ప్రజారోగ్యమే ప్రధానం కనుక -కరోనా మహమ్మారిని నిరోధించే వరకూ షూటింగులు ఆపేద్దామన్న ప్రతిపాదనతో చిరంజీవి తొలి అడుగు వేయడం తెలిసిందే. ఇండస్ట్రీ సీనియర్లు సైతం ఒక్కొక్కరుగా కరోనా నిరోధంపై అడుగు లేస్తున్నారు. వైరస్ మహమ్మారికి ప్రపంచమంతా వణుకుతున్న టైంలో -ప్రజలు మరింత భయబ్రాంతులకు గురికాకుండా ధైర్యం చెప్పాల్సిన అవసరముందంటూ దర్శకుడు రాజవౌళి సైతం ట్వీట్ చేశారు. సెలబ్రిటీలు, వైద్య ప్రముఖులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలను సూచిస్తుంటే.. కొందరు మాత్రం తెలిసీ తెలీని విషయాలతో ప్రజలు మరింత భయపడేలా వ్యాఖ్యానాలు చేస్తుండటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాకంటే తప్పుడు ప్రచారాలు విస్తృతమవుతున్నాయి. వాటిని ఆపటమే మనం తీసుకోవాల్సిన పెద్ద జాగ్రత్త. వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య ప్రముఖులు సూచిస్తోన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది’ అంటూ కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను రాజవౌళి ట్వీట్ చేశారు.