మళ్లీ... శౌర్యతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా మొదలైందంటూ -దర్శకురాలిగా కెరీర్ మొదలెట్టిన నందినీరెడ్డి ‘ఓ బేబీ’ హిట్టు తరువాత మరో హిట్టుకి రెడీ అవుతోంది. అయితే నందిలో సృజనాత్మక విషయం కంటే.. ‘ఇన్‌స్పిరేషన్’ కంటెంటే ఎక్కువంటూ అపవాదు ఎదుర్కొన్నా -తన పంథాలో ఆమె సినిమాలు చేస్తూనే వెళ్తోంది. కొరియన్ సినిమా మిస్‌గ్రానిని -తెలుగు స్క్రీన్‌కు తగిన స్క్రిప్ట్‌గా ‘రీ వర్క్’ చేయటంలో నందిని సక్సెస్ అవ్వడం తెలిసిన విషయమే. సమంత, సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోయడంతో -బాక్సాఫీస్‌వద్ద ‘ఓ బేబీ’ సక్సెస్ అనిపించుకుని దర్శకురాలు నందినికి మంచి పేరు తెచ్చింది. ఓ బేబీ హిట్టు తరువాత వెంటనే సినిమా మొదలు పెట్టకుండా గ్యాప్ తీసుకున్న నందినికి -తాజాగా మరో ప్రాజెక్టును తెరకెక్కించే చాన్స్ వచ్చినట్టే కనిపిస్తోంది. ఓబేబికి జోడీగా కనిపించిన నాగశౌర్యతో నందిని కొత్త ప్రాజెక్టు సెట్ చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు నందినితో ‘కళ్యాణ వైభోగమే’ ప్రాజెక్టు చేసిన నాగశౌర్య, కొత్త ప్రాజెక్టుకు అంగీకారం తెలిపాడన్నది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలకు కథను సెట్ చేయడంలో నందిని విఫలమైనట్టే కనిపిస్తోంది. ఎక్కువ గ్యాప్ ఇవ్వడం మంచిది కాదన్న ఉద్దేశంతో -తనకు పరిచయమున్న నాగశౌర్యతో ఓ ప్రాజెక్టును సెట్ చేస్తోన్న వైనం కనిపిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్‌పై ఈ ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.