వకీల్‌సాబ్ వచ్చేదెప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీఎంట్రీగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న రీమేక్ ‘వకీల్ సాబ్’ను మే 15న థియేటర్లకు తెస్తామంటూ కొద్దికాలం క్రితమే నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. అనూహ్యంగా తెగబడిన కరోనా ఇంపాక్ట్‌తో -అనేక సినిమాల పరిస్థితి అటూ ఇటూ అవుతోన్న నేపథ్యంలో.. వకీల్ సాబ్ విడుదలపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మహమ్మారి కరోనా నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూ -్ఫలిం ఛాంబర్ షూటింగ్‌లు రద్దు చేయడం తెలిసిందే. మార్చి 31 వరకూ ఇండస్ట్రీకి పాక్షిక సెలవు ప్రకటించింది కూడా. ఏప్రిల్ నుంచి షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశమున్నా -కచ్చితమే కాదా అన్న విషయం పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుంది. నిజానికి రీమేక్ సినిమా వకీల్ సాబ్‌ను త్వరగా పూర్తి చేయడానికి ఫస్ట్‌నుంచీ టైట్ షెడ్యూల్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు అననుకూల వాతావరణం ఉండటంతో -షూటింగ్‌ను అనుకున్నంత వేగంగా పూర్తి చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ప్రభాస్ జాన్ ప్రాజెక్టును జార్జియాలో షూట్ చేస్తున్నట్టు -మరో ప్రాంతంలో వకీల్ సాబ్ షూట్‌ని పూర్తి చేసే అవకాశమూ లేదు. సెట్స్ సెట్ చేసుకోవడం దగ్గర్నుంచి, ఇప్పటికిప్పుడు ఎటూ కదిలే పరిస్థితి లేదు. చాలాభాగం ఇక్కడే షూట్ చేశారు కనుక, కంటిన్యుటీ కోసమైనా షూట్‌ను ఇక్కడే కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బందుల మధ్య వకీల్ సాబ్‌ను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం షూట్ పూరె్తైన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసినా -మిగిలిన భాగానికి షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేసినా పవన్ కల్యాణ్ అనుక్షణం అందుబాటులో ఉంటారన్న గ్యారెంటీ కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రాజెక్టును పూర్తి చేసి అనుకున్న టైంకి విడుదల చేస్తారా? లేక చాలా చిత్రాల మాదిరిగా దీన్నీ వాయిదా వేసుకుంటారా? అన్నది చూడాలి.