క్రేజీ అనుష్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో అనుష్క క్రేజ్ వేరు. తోటి హీరోయిన్లకు ఏమాత్రం అందనంత ఎత్తులో ఉంది అనుష్క. చేస్తున్న సినిమాలు తక్కువే అయినా -అందం, అభినయం, ఔచిత్యం.. మన్నన అన్ని విషయాల్లోనూ స్వీటీకి హండ్రెడ్ పర్సెంట్ మార్కులే పడుతున్నాయి. ఎవర్ గ్రీన్ హీరోయిన్‌గా సుదీర్ఘ ప్రస్తానాన్ని సాగించిన స్వీటీ, త్వరలో హారర్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’తో ఆడియన్స్ ముందుకు రానుండటం తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌లా ఇప్పటికీ హవా నడిపిస్తోన్న అనుష్క, త్వరలోనే ప్రభాస్ మాతృ సంస్థ బ్యానర్‌పై సినిమా చేయనుందట. స్వీటీని ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్‌లో చూపిస్తూ -యువీ క్రియేషన్స్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టును గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్నారని వినిపిస్తోంది. మరోపక్క ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో ప్రాజెక్టుకు ఒప్పుకుని ఇండస్ట్రీకి మరో షాకిచ్చింది స్వీటీ. చాలాకాలం క్రితం ‘రారా కృష్ణయ్య’ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ మహేష్ చెప్పిన లైన్ నచ్చటంతో స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న టాక్ లేకపోలేదు. చిరంజీవి తాజా ప్రాజెక్టు ‘ఆచార్య’లోనూ స్వీటీని తీసుకోడానికి దర్శకుడు కొరటాల ఆసక్తి చూపిస్తున్నాడన్న కథనాలు లేకపోలేదు. మరో రెండు ప్రాజెక్టులు సైతం స్వీటీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లికి రెడీ అవుతోంది కనుకే -అనుష్క సినిమాలు తగ్గించేసిందంటూ వినిపించిన వార్తలకు స్వీటీ ఈ ప్రాజెక్టులతో సరైన సమాధానమే ఇస్తోంది. వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతోన్న స్వీటీ స్పీడ్‌ని -ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తోంది.