డబ్ల్యుఎఫ్‌ఎల్.. లెక్క సరిచేస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాను రీమేక్ చేయాలంటే కష్టమెంతుంటుందో, సౌలభ్యమూ అంతే ఉంటుంది. ప్రధానంగా -మాతృకలోని లోపాలను సరిచేసి రీమేక్‌తో హిట్టుకొట్టొచ్చు. అలా హిట్టుకొట్టిన సినిమాలున్నాయి కూడా. విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ -వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో కరణ్ జోహార్ అదే చేయబోతున్నాడట. ఫేజ్ మార్చనున్నాను కనుక -ఇదే నా చివరి లవ్ స్టోరీ అంటూ విజయ్ దేవరకొండ ‘డబ్ల్యుఎఫ్‌ఎల్’ చేశాడు. క్రాంతిమాధవ్ తెరకెక్కించిన ఆ చిత్రం -విజయ్ ఇమేజ్‌ను రెండు పాయింట్లు కిందకు లాగేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఫ్లాప్‌కు కారణాలు సవాలక్ష అంటూ అనేక కథనాలు వచ్చినా -నలుగురు హీరోయినే్ల పెద్ద మైనస్ అంటూ విశే్లషణలూ వచ్చాయి. అయితే, సినిమా నిర్మాణంలో ఉన్న టైంలోనే కరణ్‌జోహర్ బాలీవుడ్ రైట్స్ తీసుకున్నాడు. సినిమా పల్టీ కొట్టడంతో-డియర్ కామ్రేడ్ మాదిరిగానే దీన్నీ పక్కన పడేస్తాడనే అనుకున్నారు. కాని, సక్సెస్‌ఫుల్ మేకర్‌గా అతని లెక్కలు అతనికుంటాయి. తాజాగా డబ్ల్యుఎఫ్‌ఎల్ రీమేక్‌కు రెడీ అవుతున్నాడట. సినిమాలో కొద్దిపాటి మార్పులు చేస్తే -బాలీవుడ్ ఆడియన్స్‌ని బాగా కనెక్టవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడట. కథలో క్లారిటీ మిస్సవ్వడం, లవ్ ట్రాక్స్‌లో ట్విస్ట్‌లు బలంగా లేవన్న మైనస్‌లను సరిచేస్తే -నార్త్ ఫ్లేవర్‌లో అద్భుతంగా ఉంటుందన్న ధీమాతో ఉన్నాడట కూడా. విజయ్‌కి బాలీవుడ్‌లో మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో -సినిమా వర్కౌటవుతుందన్న లెక్కలేస్తున్నాడని అంటున్నారు. ఏమో కరణ్ స్ట్రాటజీ వర్కౌట్ కావొచ్చేమో.