తగ్గితే.. తప్పేంటి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తగ్గితే తప్పులేదు బాబూ -అనిపించాడు పూజాహెగ్దెతో దర్శకుడు త్రివిక్రమ్. నిజానికి ఆ రెండు పదాలే ‘అరవింద సమేత..’ చిత్రానికి -సోల్ టర్న్. ఆ రెండు పదాల్లోనే -జయానికి, జీవితానికీ పనికొచ్చే విషయాన్ని పొందుపర్చాడు దర్శకుడు. ఇప్పుడు -ఇండస్ట్రీకి ఈ రెండు పదాల అవసరం చాలావచ్చింది. అందుక్కారణం -కరోనా. వైరస్‌కి, వెనకడుగుకీ సంబంధమేంటని తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. విడుదల కావాల్సిన సినిమాలు ప్రస్తుతం వాయిదా పడినా -తరువాత ఏదోకరోజుని విడుదల తేదీగా సెట్ చేసుకోకపోవు. అనివార్య పరిస్థితులు కనుక వాయిదాలు ప్రకటించేస్తున్నారుగానీ, మళ్లీ విడుదల తేదీలు సెట్ చేసుకునే టైంలో తగ్గొగ్గులు, తలనొప్పులు తలెత్తే పరిస్థితి లేదనలేం. కరోనా ఇంపాక్ట్‌తో ఇప్పటికే -ఇండస్ట్రీలో అత్యయిక పరిస్థితి అమలవుతోంది. టాలీవుడ్‌కు దాదాపు షట్టర్లు పడిపోయాయి. దీంతో నిర్మాణంలోవున్న చిత్రాలు, చివరికి చేరిన సినిమాలు.. -ల్యాబ్‌ల పనులు ముగించుకునే పనిలో పడ్డాయి. ఇంతవరకూ ఓకే. వచ్చే చిక్కల్లా -ఇప్పటికే పూరె్తై విడుదల కోసం ఉత్సాహం చూపిస్తోన్న సినిమాలతోనే. మార్చి 31 వరకూ ‘బిగ్ స్క్రీన్ వినోదం’ ఎలాగూ బంద్ కనుక -విడుదల కావాల్సిన సినిమాలు వెనక్కి జరిగాయి. వాయిదా పడుతున్న సినిమాలేవీ -మళ్లీ విడుదల తేదీలను వెంటనే ప్రకటించలేని పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షల సీజన్ కనుక -పెద్ద చిత్రాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉండదు. అందుకే గత ఫిబ్రవరి చిన్న సినిమాలు థియేటర్ల వద్ద బారులు తీరాయి. నిజానికి మార్చిలోనూ అదే పరిస్థితి ఉండేదేమో. కాకపోతే -కరోనా దెబ్బకు సినిమాల విడుదల ఆగిపోయింది. ఈ విషయంలో ఇప్పటికే చిన్న నిర్మాతలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. కరోనా తెచ్చిన దురదృష్టాన్ని కసితీరా తిట్టుకోవడం తప్ప, మరెవర్నీ అనుకునే పరిస్థితి లేకపోవడంతో వౌనం వహించక తప్పడం లేదు. ఇక ఏప్రిల్, మే మాసాలను ‘వేసవి వినోదం’గా టాలీవుడ్ ఫీలవుతుంటుంది. సమ్మర్ సెలవులు, పరీక్షల అడ్డు లేకపోవడంలాంటి అంశాలు -వినోద పరిశ్రమకు మంచి లాభాలే తెస్తుంటాయి. నిజానికి మార్చి చివరి వారంనుంచే మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంది. వాటిలో ప్రధానంగా నాని-సుధీర్‌బాబు కాంబోలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘వి’ ఒకటి. మార్చి 25న విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఫిక్స్ చేసుకున్న డేట్‌ని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. దీని తరువాత చిత్రంగా చెప్పుకోవాల్సింది ‘ఒరేయ్ బుజ్జిగా’. మార్చి 25నే రావాల్సిన ఈ సినిమా సైతం వాయిదా పడినా -తరువాతి డేట్ ఫిక్స్ కాలేదు. ఏప్రిల్ 2 శ్లాట్‌లో విడుదలకు పోటీ లేకుండా చూడాలంటూ నిర్మాతల గిల్డ్‌లో ప్రతిపాదిస్తానని నిర్మాత కెకె రాధామోహన్ అంటుండటం తెలిసిందే. తరువాతి చిత్రంగా యాంకర్ హీరో ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ జోడీగా కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన -30 రోజుల్లో ప్రేమించడమెలా చిత్రాన్ని చెప్పుకోవాలి. ఈ సినిమానూ వాయిదా ప్రకటించారుకానీ, తరువాతి విడుదల తేదీని కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ వాయిదాల పర్వం మార్చి 31లోపు విడుదల కావాల్సిన చిత్రాలకే పరిమితం కాలేదు. కరోనా ఇంపాక్ట్ ఎప్పటి వరకూ ఉంటుందో అంచనాలు కష్టం కనుక -ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన సినిమాలూ వెనక్కి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 2న పెద్దఎత్తున విడుదల కావాల్సిన రానా -అరణ్య వాయిదాపడింది. అదే రోజున పంజావైష్ణవ్‌తేజ్ డెబ్యూ ఫిల్మ్ ఉప్పెన, కొంత గ్యాప్ తరువాత అనుష్క చేస్తున్న -నిశ్శబ్ధం చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. సినిమా ప్రమోషన్స్ లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసే పరిస్థితి ఉండదు కనుక -వాటినీ వెనక్కి జరుపుతున్నట్టు మేకర్లు ప్రకటించే అవకాశముంది. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్టు ఉత్సాహంతో హీరో రామ్ పోతినేని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -రెడ్. ఏప్రిల్ 9 రిలీజ్ డేట్‌ను ముందే ప్రకటించుకున్న నేపథ్యంలో ఆఘమేఘాల మీద ఈ రీమేక్‌ను పూర్తి చేశారు. సినిమా ప్రమోషన్స్ నిర్వహించుకునే అనుకూల వాతావరణం ఇండస్ట్రీలో లేకపోవడం, డిజిటల్ మీడియా మీదే ఆధారపడి ప్రమోషన్స్ పూర్తి చేయలేరు కనుక.. ఈ సినిమా సైతం వాయిదా పడొచ్చని ఒక అంచనా. ఏప్రిల్ తొలి రెండువారాలు సినిమాల విడుదలకు సరైన వాతావరణం ఉండే అవకాశం లేదు కనుక -మొత్తంగా ఐదారు సినిమాలు కొత్త రిలీజ్ శ్లాట్స్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ చివరి రెండు వారాలు, మే మొత్తాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే కొన్ని సినిమాలు షెడ్యూలై ఉన్నాయి. వాటి రిలీజ్ డేట్లు ఇప్పటికింకా ప్రకటించకున్నా -వేసవిని టార్గెట్ చేసుకునే అవి రెడీ అవుతున్నాయి. రేపో మాపో వాటి రిలీజ్ డేట్స్ ప్రకటించొచ్చు. సో, ఇప్పటికే వాయిదా పడిన సినిమాలకు రిలీజ్ షెడ్యూల్ దొరకటం అంత ఈజీ కాదు. సో, సినిమాల మధ్య క్లాష్‌కు ఎక్కువ చాన్సుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యే అయినా -తలెత్తిన అనివార్య పరిణామాల్లో కొందరైతే నష్టపోక తప్పేట్టు లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు కత్తిమీద సామే. నిర్మాతలు ఈ’గోలకు పోతే -అనేక కోణాల్లో సమస్యలుత్పన్నమై మంచి సినిమాలు సైతం చచ్చిపోయే పరిస్థితి రావొచ్చు. ఇక్కడే దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన రెండు పదాల బలం కనిపించేది. ‘తగ్గితే తప్పేంటమ్మా?’ అంటూ తెలివిని ప్రదర్శించి.. సుహృద్భావ వాతావరణంలో విడుదల తేదీలు నిర్ణయించుకోడానికి ఎంతమంది నిర్మాతలు ముందుకొస్తారో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గడంలో తెలివిని ప్రదర్శించే నిర్మాత మాత్రం -కచ్చితంగా జయాన్ని, జీవితాన్ని అందుకోవడం ఖాయం.