ఎఫ్ -మూడులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా ‘ఎఫ్2’తో గతేడాది సంక్రాంతి హిట్టు కొట్టాడు అనిల్ రావిపూడి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ల పర్ఫెక్ట్ వంటకంగా దర్శకుడు అనిల్‌కు మంచి పేరు తెచ్చిందీ చిత్రం. ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్టుకొట్టిన అనిల్ -వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్3’తో హిట్టుకొట్టే ఆలోచనలో ఉన్నాడట. ఫన్, ఫ్రస్ట్రేషన్‌కు మరో ఎఫ్‌ని జోడించే మంచి కథను వండుతున్నట్టు తెలుస్తోంది. కథతోపాటు కథనాన్నీ ఆసక్తికరంగా అందిస్తే.. సినిమా హిట్ ఖాయమన్న అనిల్ తన సిద్ధాంతాన్ని మరోసారి రుజువుచేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. స్క్రిప్ట్ కోసం వైజాగ్‌లో మకాం వేసిన అనిల్ -అరకు ప్రకృతి అందాలమధ్య స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఎఫ్2 హీరోలు వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతోపాటు మూడో ఎఫ్ హీరో? ముగ్గురికీ జోడీలుగా అనిల్ ఎవరిని ఎంచుకుంటాడన్నది చూడాలి.