విలనీ వైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్తింపుపొందిన లేడీ విలన్లు బహు తక్కువ. సూర్యకాంతం, ఛాయాదేవి, విజయలలిత, జ్యోతిలక్ష్మిలాంటివాళ్లు నెగెటివ్ షేడ్స్ పాత్రలతో మెప్పించారు. అలాంటి ఆర్టిస్టులు ఇక కరవయ్యారని అనుకుంటున్న తరుణంలో -ఈ జనరేషన్ లేడీ విలన్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. తమిళ హీరో శరత్‌కుమార్ తనయ వరలక్ష్మి. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తమిళ ఇండస్ట్రీలో. వరలక్ష్మి విలనీ పాత్రలు చేసిన సినిమాలు తెలుగులోనూ అనువాద చిత్రాలుగా ఆదరణకు నోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్ట్రెయిట్ తెలుగు మూవీలో వరలక్ష్మిని విలనీగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. రవితేజతో రూపొందిస్తున్న చిత్రంలో నెగెటివ్ షేడ్స్‌వున్న కీలక పాత్రకోసం వరలక్ష్మిని ఎంపిక చేసుకున్నాడట. సరికొత్తగా డిజైన్ చేసిన ఈమె పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు. క్రమంగా తెలుగులోనూ వరలక్ష్మి వీర విలనీ చూపించే ప్రాజెక్టులు చేస్తుందేమో చూడాలి.