చిన్నా దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ‘ఆ ఇంట్లో’ లాంటి హారర్ చిత్రాల్ని తెరక్కెంచిన నటుడు చిన్నా మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదరి రవికుమార్ రూపొందిస్తున్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన బ్రోచర్లను హీరో శ్రీకాంత్, శివారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిన్నా మాట్లాడుతూ ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తున్నానని, మంచి కథ దొరికేవరకూ తొందరపడకుండా చేయాలని అనుకున్నానని, అదే విధంగా ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. హారర్ సినిమా కాకపోయినా పూర్తి కామెడీ నేపధ్యంలో రెండు గంటలపాటు ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని, కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో నటించారని తెలిపారు. ఆ ఇంట్లో సినిమాతో దర్శకుడిగా మారిన చిన్నా తాను మధురానగరిలో అనే సినిమాతో కెరీర్‌ను ప్రారంభించామని, ఈ సినిమా విజయవంతం కావాలని హీరో శ్రీకాంత్ తెలిపారు. ఆ ఇంట్లో సినిమా నచ్చడంతో చిన్నా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయాలని అప్పుడే అనుకున్నానని, ఇప్పుడు ఆయన చెప్పిన కథ నచ్చడంతో తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని చేస్తున్నామని, తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత రవికుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, కెమెరా: ఎన్.సుధాకర్‌రెడ్డి, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాత: ఆదరి రవికుమార్, దర్శకత్వం: చిన్నా.