ముహూర్తం కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనువైట్ల, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మిస్టర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 28న స్పెయిన్‌లో ప్రారంభం అవుతుందని తెలిసింది. నిజానికి మొదట ఈ సినిమా మే 15 నుంచి స్పెయిన్‌లో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అది జరుగలేదు. ప్రస్తుతం లాస్‌వేగాస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న వరుణ్‌తేజ్ మరికొద్ది రోజుల్లో ఇండియాకు రానున్నారు. ఆ తరువాత ‘మిస్టర్’ సినిమాపై దృష్టి సారిస్తారు. ఆగడు, బ్రూస్‌లీ లాంటి రెండు భారీ పరాజయాల తర్వాత మళ్లీ ఓ బలమైన హిట్ కొట్టాలన్న కసితో దర్శకుడు శ్రీనువైట్ల వరుణ్‌కు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాతలు కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.