భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయివెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మారుతి ఫిలిం వర్క్స్ పతాకాలపై రాజేష్ పులి దర్శకత్వంలో సంపూర్ణేష్‌బాబు, చరణ్, రాజ్, రోహన్, హమీదా ప్రధాన తారాగణంగా బోనం కృష్ణసతీష్, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ రూపొందిస్తున్న చిత్రం ‘్భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో హీరో నిఖిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో సంపూర్ణేష్ మంచి పాత్రలో నటించారని, టీజర్ అందరికీ నచ్చుతుందని తెలిపారు. పెద్దా చిన్నా సినిమాలనేవి లేవని, మంచి. చెడు వున్న సినిమాలు మాత్రమే వున్నాయని, ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, దర్శకుడు మారుతి కథను ఒప్పుకోగానే షూటింగ్ ప్రారంభించామని, ఇటీవల వచ్చిన కథ వున్న ‘్భలే భలే మగాడివోయ్’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాల్లాగే ఇదికూడా విజయవంతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు చరణ్, రాజ్, రోహన్, హమీదా పాల్గొన్నారు. సత్యం రాజేష్, సూర్య, ప్రభాస్‌శ్రీను, వేణుగోపాల్, సారికా రామచంద్రరావు, జ్యోతి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా:మల్హర్‌భట్ జోషి, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, సంగీతం:జె.బి., దర్శకత్వం:రాజేష్ పులి.

‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ’లో హమీదా