17న రుద్ర ఐపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజిత్ క్రియేషన్స్ పతాకంపై రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘రుద్ర ఐపిఎస్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత టి.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందిందని, దర్శకుడు ఈ సినిమా కథను చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. సంగీతపరంగా పాటలన్నీ హిట్ అయ్యాయని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో ఫొటోగ్రఫి హైలెట్ అని తెలిపారు. ఈ నెల 17న సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నామని అన్నారు. చంద్రమోహన్, చిత్రం శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:వంశీకృష్ణ.పి. నిర్మాత:టి.రాజశేఖరరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలకృష్ణారెడ్డి.