వయసు చెబితే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో హీరోయిన్లు అనగానే వయసు దాచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈమె మాత్రం నా వయసు ఇంత అని టక్కున చెప్పేస్తోంది. పైగా, వయసు చెప్పడానికి మొహమాటం దేనికని ఎదురు ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో సావరియా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సోనమ్‌కపూర్. అనీల్‌కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు కెరీర్ పరంగా పెద్దగా విజయాలేవీ దక్కలేదు. అయినా సరే సక్సెస్ కోసం దండయాత్రలు చేస్తూనే వుంది. ఇప్పటికే బికినీలు, లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు కెరీర్‌లో బ్రేక్ హిట్ మాత్రం దక్కలేదు. ఇటీవలే ఈమె ట్విట్టర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా 30దాటి 31లో పడ్డానని తెలిపింది. దానికి కౌంటరేస్తూ వయసు దాచుకోవడం దేనికి? అంటూ కామెంట్ పెట్టింది. మొత్తానికి సోనమ్ భలే గడుసుదే! వయసుమీరుతోంది కాబట్టి మంచి అవకాశాలు రావాలని హింట్ ఇస్తోందేమో!