సందేశాత్మక ఫ్రెండ్ రిక్వెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాలకపాటి నిర్మాణ నిర్వహణలో తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ‘టీజర్‌లో ప్రతి ఫ్రేం పెర్ఫెక్ట్‌గా ఉంది. హారర్‌కు క్రైమ్‌ను జోడించి తీసిన సినిమా ఇది. యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. దర్శకుడు ఆదిత్యాఓం మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్ నేపథ్యంలో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మితమైన ఈ చిత్రం నేటి యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సోషల్ మీడియాకు యడిక్ట్ అవుతోన్న యూత్‌కి చక్కని సందేశం ఇచ్చే చిత్రమిది. యాక్షన్ ఎపిసోడ్‌కి ఎంతో ప్రాధాన్యతనిచ్చి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘యూత్‌కి మెసేజ్ ఇచ్చే సినిమా. ఆదిత్య బాగా డైరెక్ట్ చేశారు అని చెప్పారు. ప్రకాష్ మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాను ప్రారంభించాం. ఆదిత్య ఎంతో ఫ్యాషన్‌తో ఈ సినిమా చేశారు. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: టి.రాఘవ, సంగీతం: లవన్, వీరల్ మిస్ర్తీ, నిర్మాణ నిర్వహణ: పి.విజయ్‌వర్మ, దర్శకత్వం: ఆదిత్య ఓం.