అత్తారింట్లో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలతో అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అంజన్ కె.కళ్యాణ్ రూపొందించారు. సినిమాకు సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అంజన్ కె.కళ్యాణ్ మాట్లాడుతూ, తమ యూనిట్ సహకారంతో ఈ సినిమాను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దామని, ప్రతిభ వుండి సరైన అవకాశాలు రాని ఎంతోమందిని తీసుకొని ఈ సినిమా చేశామని, ఈ సినిమా నచ్చి నేపథ్య సంగీతం మణిశర్మ అందించారని తెలిపారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టే థ్రిల్స్‌తోపాటుగా అన్నిరకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కథ, కథనాలలో కొత్తగా వుంటాయని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. మంచి పాటలు చేసే అవకాశం తనకు ఇచ్చినందుకు కళ్యాణ్‌కు కృతజ్ఞతలు అని సంగీత దర్శకుడు డెన్నిస్ నారట్స్ అన్నారు. క్వాలిటీతో ఈ చిత్రాన్న రూపొందించడానికి అన్ని వసతులు కల్పించారని కెమెరామెన్ శివశంకర్ అన్నారు. యాక్షన్, లవ్ సెంటిమెంట్ లాంటి ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల భావోద్వేగాలు ఈ చిత్రంలో వున్నాయని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కథానాయకుడు సాయి రవికుమార్ తెలిపారు. అత్తారిల్లులో మంచి పాత్ర లభించినందుకు ఆనందంగా వుందని కథానాయిక అతిథి దాస్ తెలిపారు. కార్యక్రమంలో నండూరి రాము, రాజశేఖర్, వినోద్, వంశీ రాజు, జోజు, రాకేష్ శర్మ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.