ఎంత ఘాటు ప్రేమయో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా మారిన నయనతార ఈమధ్య కోలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. అందుకే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా కూడా కాదని తమిళంలోనే వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న నయనతార వ్యవహారంపై కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూనే వుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఈమె ప్రేమలో పడిందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకూ వీరు తమ ప్రేమను రహస్యంగానే సాగించారు. కానీ ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేదికపై వీరి ప్రేమాయణం బయట పడింది. ‘నానుమ్‌రౌడీదాన్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న నయనతార దాన్ని తీసుకునే సమయంలో దర్శకుడిని స్టేజి పైకి పిలిచింది. ‘నేనీ పాత్రను చేస్తాననుకోలేదు. కానీ నేను తప్ప ఇంకెవరూ చేయలేరంటూ విక్కీ నన్ను ఎంకరేజ్ చేశాడు. ఎవరూ తప్పుగా అనుకోకుంటే విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను’ అని అనడంతో వెంటనే కిందనుంచి స్టేజీపైకి పరిగెత్తుకొచ్చిన విఘ్నేష్ నయన్‌ను వాటేసుకున్నాడు. అంతే అక్కడున్నవారందరూ షాకయ్యారు. వీరి మధ్య ఏ రేంజి ప్రేమాయణం సాగుతోందో ఒక్కసారిగా అందరికీ అర్ధమైపోయింది. మరి లేకుంటే ఇప్పటివరకూ ఎన్నోసార్లు అవార్డులు అందుకున్న నయనతార ఏ దర్శకుడి దగ్గర ఇంతగా రెస్పాండ్ కాలేదు. మొత్తానికి వీరి ప్రేమను ఇలా ప్రకటించారని అనుకుంటున్నారందరూ!

చిత్రం.. నయనతార