నేనుసైతం అంటున్న విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ కథానాయకుడు విష్ణు హీరోగా మన్ననలు అందుకుంటున్నాడు. పక్షవాతానికి గురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింపజేశారు. దుర్గాగౌడ్ అనే పాత్రికేయుని ఆరోగ్యం కోసం ఆయన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పక్షవాతంతో మంచంపట్టి చావుబతుకులతో పోరాడుతున్న పాత్రికేయుని కష్టాలను ‘నేను సైతం’ కార్యక్రమం తెరపైకి తెచ్చింది. ఆయన పిల్లలను చదివించడానికి, ఉపాధి చూపించడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో గెస్ట్ సెలబ్రిటీగా పాల్గొన్న విష్ణు ఒక్కరోజు పానీపూరి అమ్మి తన వంతుగా 75 వేల రూపాయలు సంపాదించారు. ఆ నగదును దుర్గాగౌడ్ కుటుంబానికి సహాయంగా అందించారు. మంచు లక్ష్మి తన వంతుగా లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా దుర్గాగౌడ్‌కు మొత్తం దాదాపుగా 24 లక్షల రూపాయల సహాయం అందించడం విశేషం.