ప్రేక్షకులు మెచ్చిన అర్ధనారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమా పోస్టర్లు చూసి ఇది అదో టైపు సినిమా అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇది కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగిన సినిమా. ఇప్పటికే అన్ని కేంద్రాలలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. భారతీయుడు, అపరిచితుడు, ఆపరేషన్ దుర్యోధన లాంటి చిత్రాలతో పోల్చి ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా వుంది’ అని దర్శకుడు భానుశంకర్ చౌదరి తెలిపారు. నూతన నటులు అర్జున్ యజత్, వౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ పతాకంపై భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో రవికుమార్.ఎం., కర్లంపూడి కృష్ణ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అర్థనారి’. ఈ చిత్రం గతవారం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో గురువారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పలు విషయాలు మాట్లాడుతూ, కొత్తవాళ్ళతో ఈ సినిమా తీసి విజయం సాధించినందుకు అందరూ అభినందిస్తున్నారని, ముఖ్యంగా బి, సి సెంటర్లలో కలెక్షన్లు బాగా వున్నాయని అన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా తన నటన బాగుందని అందరూ ప్రసంశిస్తుంటే సంతోషంగా వుందని అర్జున్ యజత్ తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మాలాంటి కొత్తవారిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని కథానాయిక వౌర్యాని తెలిపారు. ఈ కథ నచ్చి సమాజానికి ఓ సందేశం ఇవ్వాలన్న కోరికతో సినిమా రూపొందించామని, ఆంధ్ర, తెలంగాణలలో ఈ చిత్రం మంచి ఆదరణతో ప్రదర్శిస్తున్నారని, ఓటు హక్కు వున్న ప్రతివారూ చూడదగిన చిత్రం ఇదని, దేశభక్తి వున్న చిత్రమని నిర్మాత రవికుమార్.ఎం తెలిపారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.