సక్సెస్‌తో కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న తారలతో సినిమా తీసి విజయం సాధించడం ఆక్సిజన్ లాంటిదని ‘రోజులు మారాయి’ చిత్ర యూనిట్ అభిప్రాయం వెలిబుచ్చింది. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, తాను ‘బాబు బంగారం’ సినిమా షూటింగ్ బిజీలో వున్నపుడే నిర్మాత రాజు ఈ సినిమాపై పూర్తి కేర్ తీసుకున్నారని, అంతా ఆయనే దగ్గరుండి ఎడిటింగ్ చేయించారని, ఇంత విజయాన్ని అందించిన రెండు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలని తెలిపారు. చిన్న సినిమాగా విడుదలై ఈ చిత్రం మంచి గ్రాస్ రాబట్టిందని, ఇది తమకు ఆక్సిజన్‌లా ఉపయోగపడిందని ఆయన తెలిపారు. సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఈ సినిమాకు పనిచేశానని, అవకాశమిచ్చిన వారందరికీ రుణపడి వుంటానని, ఈ యూనిట్‌లో ప్రతి ఒక్కరూ సినిమా బాగా రావాలని కష్టపడ్డారని దర్శకుడు మురళీకృష్ణ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్‌కు విజయోత్సవ జ్ఞాపికలతో అభినందించారు.