సిక్స్ ప్యాక్‌లో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నితిన్ ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి జోరుమీదున్నాడు. ఇష్క్ సినిమాకు ముందు వరుసగా ఎనిమిది సినిమాలు ఫెయిల్యూర్స్ అవ్వడంతో కెరీర్ వెనకపడిపోయినా, కాస్త లుక్ మార్చి ఇష్క్‌తో క్లాస్ సినిమా చేశాడు. దాంతో ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. అంతకుముందు మాస్ హీరోగా రకరకాల ప్రయత్నాలు చేసిన నితిన్‌కు ఏవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో క్లాస్ బాట పట్టాడు. ఇక ఇష్క్ తరువాత ‘గుండెజారి గల్లంతయిందే’, ‘ఆ..ఆ’ సినిమాలు హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘అ..ఆ’ సినిమాతో తన ఇమేజ్‌ని బాగా పెంచుకున్న నితిన్‌తో సినిమాలు చేయడానికి ఇప్పుడు టాప్ దర్శకులు లైన్‌లో వున్నారు. ఇప్పటికే ఆయన ఓ టాప్ దర్శకుడితో మాస్ సినిమాకు రెడీ అయ్యాడని తెలిసింది. ఈ చిత్రంలో నితిన్ సిక్స్‌ప్యాక్ కూడా చూపిస్తాడట! గతంలో ఓ సినిమా కోసం నితిన్ సిక్స్ ప్యాక్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మళ్లీ దాన్ని చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తాడని అంటున్నారు. ఇప్పటికే సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్న నితిన్ మాస్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎలా వర్కవుట్ అవుతాయో చూడాలి!