అభిమానుల కోసం ప్రభాస్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు ఎ.రవితేజ, అశ్వినీ చంద్రశేఖర్, భానుశ్రీ, ప్రభాకర్ ప్రధాన తారాగణంగా రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ, తొలిసారిగా హీరో ప్రభాస్ అభిమానులకోసం చేస్తున్న చిత్రం ఇదని, ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించిందని, ఇప్పుడు థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశామని తెలిపారు. ప్రభాస్ అభిమానులమీద చిత్రీకరించిన సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, బాహుబలి ప్రభాకర్, హీరో ప్రభాస్ అభిమానుల కోసం ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించారని, అలాగే ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ చిత్రంలో రజనీకాంత్ అభిమానిగా నటించారని అన్నారు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంతోపాటుగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించనున్నామని, బ్లాక్ కామెడీతో విభిన్నమైన శైలితో నెల్లూరు మాండలికాన్ని ఈ చిత్రంలో ఉపయోగించామని ఆయన అన్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో జబర్దస్త్ వేణు, అప్పారావు ఇతర పాత్రల్లో నటించారు. కెమెరా:అర్లీ, సంగీతం:ఎం.టి.కవి శంకర్, నిర్మాత:రవి పచ్చిపాల, రచన, దర్శకత్వం:ఎస్.జె.చైతన్య.