100 రోజుల ప్రేమ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా ఎస్.ఎస్.సి మూవీ మేకర్స్ సమర్పణలో ఎస్.వెంకటరత్నం తెలుగులో అందిస్తున్న చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’. మహ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న హీరో నితిన్ తొలి సీడీని విడుదల చేసి మరో హీరో నానీకి అందించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, నిత్యామీనన్‌తో తాను ఇప్పటికే రెండు సినిమాల్లో నటించానని, అదేవిధంగా నాని కూడా రెండు సినిమాలు చేశాడని, ఇప్పుడు నిత్యామీనన్ పెద్ద స్టార్‌గా ఎదిగిన నేపథ్యంలో తాము ముగ్గురం కలిసి ఓ చిత్రంలో చేయాలని వుందన్నారు. ఈ సినిమా మంచి కథ, కథనాలతో రూపొందిందని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మలయాళ ట్రైలర్‌ను తాను చూశానని, చాలా అందంగా కనిపించిందని, సబ్ టైటిల్స్‌తో చూద్దామనుకుంటే ఇప్పుడు హాయిగా తెలుగు సినిమాలా వస్తుండడం ఆనందాన్ని ఇస్తోందని హీరో నాని అన్నారు. దర్శకుడు చిన్నవాడైనా సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన అన్నారు. తాము స్నేహితులందరం కలిసినట్లుగా ఈ చిత్రాన్ని రూపొందించామని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా వుంటుందని, కలర్స్, సెట్స్, షాట్స్, మ్యూజిక్ అన్నీ సరికొత్తగా వుంటాయని, హృదయం అనేపాట తనకు చాలా ఇష్టమైనదని నటి నిత్యామీనన్ అన్నారు. మలయాళంలోకన్నా తెలుగులోనే పాటలు బాగా వచ్చాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో దామూ, కృష్ణచైతన్య, సుధాకర్‌రెడ్డి, జెమిని సురేష్, క్రాంతి మాధవ్, గాంధీ మేర్లపాక, కె.పి.చౌదరి, సునీల్, యామిని భాస్కర్, అడవి శేష్ పాల్గొన్నారు.