కుమారికి మెగా ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన హేబా పటేల్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈమెకు మెగా చాన్స్ దక్కింది. అది కూడా మరో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ వదిలేసుకున్న అవకాశాన్ని హేబా అందిపుచ్చుకుంది. ఆ వివరాలలోకి వెళితే మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హేబా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలో ముందుగా రకుల్ ఓకే అయింది. తాజాగా ఆమెకు మహేష్ సినిమాలో చాన్స్ రావడంతో ఈ సినిమానుండి తప్పుకుంది. దాంతో ఈ అవకాశం హేబాను వరించింది. ఇప్పటికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న హేబాకు మెగా హీరోయిన్‌గా ఇమేజ్ దక్కడం ఖాయమని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.