రానాతో తేజ చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చిత్రం’ సినిమాతో సంచలన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు తేజకు చాలాకాలంగా సక్సెస్‌లు దూరమయ్యాయి. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న తేజ..ప్రస్తుతం రానా హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా కాజల్, కేథరిన్ త్రెస్సాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చరిత్ర’ అనే టైటిల్‌ను ఇటీవల ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయాలని గానీ, రాజకీయ నాయకులను గానీ టచ్ చేయకుండా రూపొందిస్తారని తెలిసింది. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు తేజ. ఈ చిత్రం ఈ నె ల చివరిలో సెట్స్‌పైకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మ రిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.