వందమంది కొత్త నటులతో దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సమాజంలో ఎక్కడోచోట నేరాలు జరుగుతూనే వుంటాయి. వాటికి అడ్డుకట్టవేయడం ప్రజల ఐక్యతలోనే వుంది అన్న నినాదంతో ‘దండు’ చిత్రాన్ని రూపొందించాం. సామాజిక స్పృహ ప్రతి మనిషికి ఉండాలని, కంటికెదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యంతో ప్రతి మనిషి ఎదగాలన్న సందేశంతో ఈ చిత్రం రూపొందింది’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా జంటగా యశస్విని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంజీవ్ మేగోటి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘దండు’ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేశారు.
కొత్తవారే అయినా..
ఈ చిత్రంతో దాదాపు వందకుపైగా నూతన నటీనటులను పరిచయం చేశాం. కథలో వారికి సరైన పాత్రను ఈ చిత్రంలో ఇవ్వటానికే స్క్రిప్ట్‌పరంగా ప్రయత్నించాం. విశేషం ఏమిటంటే, దాదాపు అందరూ పాత్రను అర్థం చేసుకుని నటించినవారే. అందుకే ఎక్కడా వారి పాత్రలే కన్పిస్తాయి కాని నటులు కనపడరు.
‘దండు’కడితే..
సమాజంలో వికృత పోకడలను ఎదిరించడానికి మనిషైన ప్రతివాడు దండుగా కదిలితేనే చైతన్యం వస్తుందని, సంఘ వ్యతిరేక శక్తులు, జన హననాన్ని ఆకాంక్షించే మూకలు ఒక్కదెబ్బకే కిందపడతాయని ఈ చిత్రంలో చెప్పారు. ముఖ్యంగా సామాజిక చైతన్యంతో రూపొందిన ఈ చిత్రం కన్నడంలో విజయం సాధించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది.
ఆదోని నేపథ్యంలో..
మా సొంత ఊరు ఆదోని నేపథ్యంగా రూపొందిన యధార్థ కథనం ఈ చిత్రం. 1970ల ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. పాత్రలన్నీ ఇప్పటి చిత్రాలలో ఉన్నట్లుగా కాకుండా భిన్నంగా కనిపిస్తాయి.
హైఓల్టేజ్ యాక్షన్
హీరో నీరజ్ శ్యామ్ కొత్తవాడైనా ఈ చిత్రంలో కథానాయకుడిగా మంచి ఈజ్‌తో నటించాడు. ముఖ్యంగా సాయికుమార్‌తో ఆయన చేసిన ప్రతి సన్నివేశం హైఓల్టేజ్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా వుంటుంది. దండు కడితే కొండలైనా పిండిచేయవచ్చు అనే నానుడి ఈ చిత్రం చూశాక ప్రతి ఒక్కరీ అర్థవౌతుంది. ఏడు ఫైట్స్ సినిమాలో ఒకదాన్ని మంచి మరొకటి వుంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా రూపొందించిన దండు తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుంది అని ముగించారు.

-యు