ఆగస్టు 12న బాబు బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ పాటను ఇటీవల విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని, ఇదే ఆనందంతో జూలై 24న ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు. విక్టరీ వెంకటేష్-నయనతార కాంబినేషన్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామని, సోషల్ మీడియాలో టాప్ ట్రేడ్‌లో పాట నిలవడం ఆనందంగా వుందని అన్నారు. వెంకటేష్ అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళీశర్మ, వెనె్నల కిషోర్, మున్నావేణు, గిరిధర్, అనంత్, రాజారవీంద్ర, రజిత, గుండు సుదర్శన్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం:జీబ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మారుతి.